Radhe Shyam: రాధేశ్యామ్ అప్డేట్స్ ఇవ్వడం లేదని అభిమాని సూసైడ్ నోట్

అభిమానం ముసుగులో కొందరు చేసే వికృత చేష్టలు స్టార్స్‌ని ఎంతగా ఇబ్బంది పెడుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల వలన హీరోలు అనేక ఇబ్బందులు పడుతుండడం గతంలో చాలానే చూసాం. తాజాగా ప్రభాస్ అభిమాని ఒకరు రాధే శ్యామ్ అప్ డేట్స్ ఇవ్వడం లేదని సూసైడ్ నోట్ రాసారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
లేఖలో సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ అంటూ అని అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ లెటర్ లో ఓ అభిమాని తన ఆవేదనను తెలిపాడు. అంతేకాదు నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ లేఖలో పేర్కొన్నాడు.
రాధేశ్యామ్ చిత్రం అప్డేట్స్ ఇవ్వని కారణంగా ఆత్మహత్య చేసుకోవడమేంటి, పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రాధే శ్యామ్ చిత్రంకి సంబంధించి మేకర్స్ అప్పుడప్పుడు పోస్టర్ లేదంటే చిన్న గ్లింప్స్ మాత్రమే విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలో ఫ్యాన్ హర్ట్ అయి ఉంటాడని తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

