Sankranthiki Vasthunnam | టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ Venky Anil 3గా రాబోతుంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు ప్రోమో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఫుల్ లిరికల్ వీడియో టైంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సాంగ్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. రమణ గోగుల, మధు ప్రియ పాడిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశాడు. ఈ పాట సినిమాకు హైలెట్ కాబోతుందని ఐశ్వర్యరాజేశ్-వెంకీ కాంబో లుక్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఇటీవలే ఈ సినిమాలో వెంకటేశ్ -మీనాక్షి చౌదరి కాంబోలో వచ్చే ఓ పాటను డెహ్రాడూన్, ముస్సోరి, రిషికేశ్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నట్టు తెలియజేస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
Brining a magical melody from #SankranthikiVasthunam to set the perfect mood this winter 😍
#GodariGattu Lyrical Video Tomorrow at 11:07 AM❤️🔥A #Bheemsceciroleo Musical
Lyrics by @bhaskarabhatla
Sung by @RamanaGogula #MadhuPriya… pic.twitter.com/SbxjQfWi11— Sri Venkateswara Creations (@SVC_official) December 2, 2024
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట
Harish Shankar | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. షోలే డైరెక్టర్‌తో హరీష్ శంకర్