‘దేవదాస్’, ‘బాజీరావ్ మస్తానీ’ ‘పద్మావత్’ వంటి గొప్ప చిత్రాలను నిర్మించిన సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) .. నెటఫ్లిక్స్తో చేతులు కలిపారు. ప్రీ ఇండిపెండెన్స్ సెట్ సిరీస్ ‘హీరమండి’ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో ఆయన కలిసి పనిచేయనున్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకున్న భన్సాలీ.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు సమాచారం. భన్సాలీ తన ట్రేడ్‌మార్క్ అయిన పెద్ద పెద్ద సెట్లు, బహుముఖ పాత్రలు, మనోహరమైన కూర్పులను మరోసారి ఈ సిరీస్‌లో మన కళ్లను కట్టిపడేయనున్నాయి.
58 ఏండ్ల వయసున్న భన్సాలీ ‘హీరమండి’ చిత్ర నిర్మాతగా తన సినిమా ప్రయాణంలో మరో ప్రత్యేకమైన మైలురాయిని అందుకోనున్నారు. ‘ఇది ఒక పురాణం. లాహోర్ వేశ్యల మీద ఆధారపడిన తొలి సిరీస్ ఇది. అన్నింటినీ కలిగి ఉండే గొప్ప సిరీస్. కాబట్టే దీన్ని నిర్మించడం పట్ల ఉత్కంఠతో ఉన్నాను. నెట్‌ఫ్లిక్స్‌తో నా భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాను. ‘హీరమండి’ ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాను’ అని భన్సాలీ చెప్పారు. ‘భావోద్వేగభరితమైన కథ చెప్పడం, అద్భుతమైన సెట్లు, మరపురాని పాత్రలతో సంజయ్ లీలా భన్సాలీ ఒక అద్భుతమైన సినిమా బ్రాండ్‌ని సృష్టించారు. నెట్‌ఫ్లిక్స్ ద్వారా అతడి అసాధారణమైన సృజనాత్మక స్టోరీటెల్లింగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుసురావడానికి సంతోషిస్తున్నాం’ అని నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వైస్‌ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ పేర్కొన్నారు.
1996 లో ‘ఖామోషి’ మ్యూజికల్ హిట్‌తో సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడిగా అరంగేట్రం చేశారు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా పనిచేసిన భన్సాలీ ప్రధాన ప్రాజెక్ట్‌లలో ‘బ్లాక్’, ‘గుజారిష్’ ‘గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా’ ఉన్నాయి.
వీరి నివాసం కేరాఫ్ పోలీస్ స్టేషన్..!
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీ పర్యటన
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..