Sanjay Leela Bhansali | వాస్తవిక కథలను అందంగా, అందరికి అర్థమయ్యేట్టుగా తెరపై చూపించడంలో సంజయ్ లీలా భన్సాలీ సిద్ద హస్తుడు. ఈయన సినిమాలలో టేకింగ్ గాని, విజువలైజేషన్ గాని ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి. బాలీవుడ్లో పిరీయాడిక్ చిత్రాలను ఈయన కన్నా బాగా ఎవరు తెరకెక్కించలేరేమో అని అనిపిస్తుంది. ఈయన దర్శకత్వంతో పాటు తన సినిమాలకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేస్తుంటాడు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘గంగుబాయి కతియావాడి’. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్‌గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. అలియాభట్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై మంచి విజయం సాధించింది.
తాజాగా అలియాభట్, సంజయ్ లీలా భన్సాలీ జరిపిన సంభాషణలో భాగంలో భన్సాలీ ఇప్పుడున్న నటీమణులలో అలియాభట్ తన ఫేవరెట్ అని తెలిపాడు. అంతేకాకుండా అలియా.. తనతో మళ్లీ సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటావా అని అడుగగా. దానికి బదులుగా భన్సాలీ ఎల్లప్పుడు సిద్దంగానే ఉంటాను అంటూ చెప్పాడు. తాజాగా గంగూబాయి కతియావాడి చిత్రంతో అలియా వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈమె నటనకు ప్రేక్షకులే కాకుండా సినీ క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. ఆలియా భట్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘హర్ట్ ఆఫ్ స్టోన్’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.