Mad 2 | సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ కాంబోలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ (Mad). డెబ్యూ యాక్టర్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్, గోపికా ఉద్యన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే.
తాజాగా దీనికి సంబంధించిన వార్తను అందరితో షేర్ చేసుకున్నారు యూనిట్. మ్యాడ్ స్క్వేర్ (Mad 2)ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11:07 గంటలకు లాంఛ్ చేయనున్నారు. అంతేకాదు ఫస్ట్ లుక్‌తోపాటు ఫస్ట్ సింగిల్ కూడా ఆవిష్కరించనున్నారని ఇన్సైడ్ టాక్. బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్తో తిరిగొస్తున్నారు. మ్యాడ్ 2 కమింగ్ అంటూ ఆటోలో అనౌన్స్మెంట్ మెంట్ చేస్తున్న స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సీక్వెల్‌ను నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
Get ready for 𝐌𝐀𝐃 𝐌𝐀𝐗𝐗 Entertainment 💥🥳
First Look & First Single Announcement of #MADSquare will be out TOMORROW @ 11:07 AM. 😎🤩@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin @SangeethShobhan #RamNitin #BheemsCeciroleo @NavinNooli… pic.twitter.com/MrBoJoHACr
— Sithara Entertainments (@SitharaEnts) September 17, 2024
Jani Master | పెద్ద హీరో ఆ అమ్మాయికి సినిమాలో అవకాశమిస్తామన్నారు.. జానీ మాస్టర్ వివాదంపై ఝాన్సీ