గత ఏడాది ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని దక్కించుకుంది నిహారిక కొణిదెల. స్వీయ నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నూతన తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా నిహారిక నిర్మాతగా రెండో చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు. సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకురాలు.
సంగీత్శోభన్ సోలో హీరోగా నటించనున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. దర్శకురాలు మానసశర్మ గతంలో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్‌సిరీస్‌కి రచయితగా, ‘బెంచ్లైఫ్’ సిరీస్‌కి దర్శకురాలిగా పనిచేశారని, ఈ చిత్రం ద్వారా ఫీచర్‌ఫిల్మ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారని మేకర్స్ తెలిపారు.