Sandeep Reddy Vanga | టాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు సందీప్ రెడ్డి వంగా. ఈ స్టార్ డైరెక్టర్ మరో వైపు నిర్మాత అని కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సందీప్ రెడ్డి వంగా నిర్మించే సినిమాలకు హోం బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ నేతృత్వం వహిస్తుంది. సందీప్ రెడ్డి వంగా తన ప్రొడక్షన్ వెంచర్స్‌ను కొత్త సినిమాతో మరింత విస్తరింప జేసే ప్లాన్‌లో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి సపోర్ట్‌తో డెబ్యూ దర్శకుడిని పరిచయం చేస్తూ కొత్త సినిమా రాబోతుంది.
ఈ చిత్రానికి రొమాంచికం అనే టైటిల్‌ను కూడా ఫైనల్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ వేణు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా..? సుమంత్ ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. సందీప్ రెడ్డి వంగా వెంచర్లో సినిమా వస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి.
బలమైన కథ, కథనంతో ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసే టాలెంట్ సందీప్ రెడ్డి వంగా సొంతమనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి డైరెక్టర్ సహకారంతో యువ హీరోతో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రాబోయే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. మరి సందీప్ రెడ్డి వంగా టీం ఎలాంటి స్టోరీని తెరపైకి తీసుకురాబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Sai Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. లగ్నపత్రిక వేడుక ఫోటోలు వైరల్!
INCA 2026 | ఉత్తమ నటుడిగా నాగ చైతన్య… రష్మికకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు