Sai Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. లగ్నపత్రిక వేడుక ఫోటోలు వైరల్!
Sai Srinivas | టాలీవుడ్లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావ్య రెడ్డితో ఆయన వివాహం నిశ్చయమైంది. రీసెంట్గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంటకు సంబంధించిన ‘లగ్నపత్రిక’ వేడుక ఘనంగా జరిగింది.
Sai Srinivas | టాలీవుడ్లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావ్య రెడ్డితో ఆయన వివాహం నిశ్చయమైంది. రీసెంట్గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంటకు సంబంధించిన ‘లగ్నపత్రిక’ వేడుక ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య జరిగిన ఈ కార్యక్రమం చాలా సాదాసీదాగా, కానీ ఆనందోత్సాహాల మధ్య పూర్తయ్యింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సాయి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వెంటనే వైరల్ అయ్యాయి. ఫోటోలలో సాయి శ్రీనివాస్ హ్యాపీగా, క్యూట్ లుక్స్‌తో కనిపించగా, కావ్య రెడ్డి కూడా సంప్రదాయ వేషధారణలో ఆకట్టుకుంది. ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ లగ్నపత్రిక వేడుకలోనే పెళ్లి ముహూర్తాన్ని ఏప్రిల్ 29గా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే, సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శ్రీను’ చిత్రంతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, తన స్టైల్, యాక్షన్ సన్నివేశాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన సినిమాలు హిందీ డబ్బింగ్లో కూడా మంచి వ్యూస్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి. గత ఏడాది ఆయన చేసిన సినిమాలు మంచి స్పందన తెచ్చుకోగా, ప్రస్తుతం కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా హైందవ అనే అడ్వెంచర్ థ్రిల్లర్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్నారు.
ఒకవైపు కెరీర్లో సక్సెస్‌ను ఆస్వాదిస్తూ, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్న సాయి శ్రీనివాస్… తన అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ అందించాడు. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంటకు అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాయి శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండాలని, కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

