Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన భారీ పారితోషికాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.800 నుంచి 900 కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన పారితోషికాలు కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. హీరో అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ కోసం రూ.175 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో 15 శాతం వాటాను తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా విజయవంతమైతే ఆయన మొత్తం సంపాదన రూ.300 కోట్లకు పైగా వెళ్లే అవకాశముందని విశ్లేషణలు చెబుతున్నాయి.
ఇక దర్శకుడు అట్లీ కూడా తన స్థాయికి తగ్గట్టుగా భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయానంతరం ఆయన ఈ సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు టాక్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఆమెకు రూ.20 నుంచి 25 కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్లు తెలుస్తోంది. అలాగే నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఈ పాత్ర కోసం ఆమెకు రూ.5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం అందుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్, అట్లీ స్టైల్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ‘రాకా’ను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్‌తోనే భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఇండస్ట్రీలో రికార్డుల చర్చ మొదలైంది. విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే, అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రాబోతున్న ‘రాకా’ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న తాజా చిత్రం రాకా అల్లు అర్జున్ హీరోగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.