Bigg Boss OTT S3 | బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. హిందీలో బ్లాక్ బస్టర్ రియాలీటి షో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3 (Biggboss OTT Season 3 Hindi) పూర్తయింది. ఈ సీజన్ విజేతగా నటి సనా మక్బుల్ (Sana Makbul) నిలిచారు. సనా మక్బుల్‌కు, నేజీకు మధ్య చివరివరకు తీవ్ర పోటీ నెలకోనగా.. చివరకు సనానే విజేత అంటూ సీజన్3 హోస్ట్ అనిల్ కపూర్ ప్రకటించారు. సనా టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని గెలుచుకుంది.
జూన్ 21న ప్రారంభమైన ఈ సీజన్ ఆగస్టు 2తో పూర్తయింది. ఓటీటీలో రన్ అవుతున్న ఈ షోకి గతంలో కరణ్‌జోహర్, సల్మాన్‌ఖాన్ హోస్ట్‌లుగా వ్యవహారించారు. ఇక ఫైనల్ ఎపిసోడ్లో స్త్రీ 2 లో కలిసి నటిస్తున్న రాజ్‌కుమార్ రావు, శ్రద్దాకపూర్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
ముంబయిలో పుట్టిన సనా మోడలింగ్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. పలు సోప్ ఓపెరా(సీరియల్స్)ల్లో నటిస్తునే అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో సనా నటించిన చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’. నాగశౌర్య, అజయ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రంలో సనా కథానాయికగా నటించింది.
🥁Drumrolls🥁
Our diva, Sana Makbul grabs the shining trophy for Bigg Boss OTT 3.
Congratulations @SANAKHAN_93 🎉 🥳🏆#BiggBossOTT3 #BBOTT3onJioCinema #BBOTT3 #BiggBoss #JioCinemaPremium pic.twitter.com/OuigmIfC5B— JioCinema (@JioCinema) August 2, 2024
Also Read..
Mohanlal | లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో.. వయనాడ్‌లో పర్యటించిన మలయాళ నటుడు మోహన్‌లాల్