Samyuktha | ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. తన అందం, అభినయంతో జనం హృదయాల్లో చోటు సంపాదించుకున్నది మలయాళ బ్యూటీ సంయుక్త. ఈ సినిమా అనంతరం మాస్టారూ.. మాస్టారూ.. నా మనసును గెలిచారు’.. అంటూ ధనుష్ ‘సార్’తో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది.
ఈ చిత్రాల తర్వాత బింబిసార, డెవిల్ సినిమాలతో మంచి హిట్స్‌ను ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో నిఖిల్‌తో స్వయంభు అనే సినిమాలో నటిస్తుంది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటది అన్న సంగతి తెలిసిందే. తన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలావుంటే తాజాగా సంయుక్త చీరలో మెరిసింది. గులాబీ కలర్ శారీలో ఒక మాల్కి వచ్చిన సంయుక్త అక్కడ కాఫీ తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest clicks of Gorgeous #Samyuktha@iamsamyuktha_ pic.twitter.com/8q4FcBO2HG
— Vamsi Kaka (@vamsikaka) June 26, 2024
ఇవి కూడా చదవండి..