Akkineni Nagarjuna | తాను క్షమాపణలు చెప్పిన అభిమానిని కలిసిన నాగార్జున.. వీడియో వైరల్
Akkineni Nagarjuna | టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున (Nagarjuna) ఇటీవల ఓ అభిమానికి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. హీరో నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్లో భాగంగా నాగార్జున ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా అనుకోని ఘటన జరిగింది.
Akkineni Nagarjuna | టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున (Nagarjuna) ఇటీవల ఓ అభిమానికి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. హీరో నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్లో భాగంగా నాగార్జున ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా అనుకోని ఘటన జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో నాగార్జునతో పాటు ధనుష్ నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడే షాపులో పనిచేస్తున్న ఓ అభిమాని నాగ్‌ను కలిసేందుకు ముందుకు వచ్చాడు. దీంతో ఆ అభిమాని వికలాంగుడు అని కూడా చూడకుండా సెక్యురిటీ గార్డ్ అతడిని గట్టిగా పక్కకు తోసేశాడు. కిందపడబోయిన అతడు తమాయించుకుని నిలబడ్డాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.
దీంతో మానవత్వం ఏమైపోయింది అంటూ నెటిజన్లు నాగార్జునను విమర్శించారు. అయితే ఈ వివాదం నాగ్ దృష్టికి కూడా వెళ్లింది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఇలాంటిది జరగకుండా ఉండాల్సింది. ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను అంటూ నాగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఇదిలావుంటే తాజాగా కిందపడిన అభిమానిని నాగార్జున కలుసుకున్నాడు. ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వస్తుండగా అతడిని కలుసుకున్నాడు. ఇక నాగార్జునను కలిసిన ఆనందంలో అతడికి బోకే గిప్ట్గా ఇచ్చాడు ఆ అభిమాని. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
King Nagarjuna ❤️
— Vamsi Kaka (@vamsikaka) June 26, 2024
Where has humanity gone? #nagarjuna pic.twitter.com/qnPjJngIxM
— Viral Bhayani (@viralbhayani77) June 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

