Sammelanam | ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్లోకి సరికొత్త యూత్‌ఫుల్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సమ్మేళనం సిరీస్ ఇవాల్టి ( ఈనెల 20వ తేదీ) నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ప్రియా వడ్లమాని, గానాదిత్య, విఘ్నయ్ అభిషేక్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.
ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు అందరి జీవితంలోనూ ఉంటాయి. దాన్నే కాన్సెప్ట్‌గా చేసుకుని డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ దర్శకత్వంలో సునయనీ, సాకేత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాలేజీ రోజుల్లో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతాడు. స్వచ్ఛమైన ప్రేమను పొందుతాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల స్నేహితులు అందరికీ ఆ యువకుడు దూరమవుతాడు. ఆ తర్వాత తన కాలేజీ డేస్లోని మధుర జ్ణాపకాలను పంచుకుంటూ ఒక పుస్తకం రాస్తాడు. దాని పేరే సమ్మేళనం. మరి ఆ పుసక్తం దూరమైన స్నేహితులను ఎలా ఒక్కటి చేసింది? అనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఫుల్ యూత్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.