టాలీవుడ్ (Tollywood) భామ సమంత (Samantha) ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో ‘యశోద’ (Yashoda) చేస్తున్న విషయం తెలిసిందే. హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది. యశోద సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. డిసెంబర్ 6న తొలి షెడ్యూల్ మొదలవగా..సంపత్‌రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేశ్, దివ్య శ్రీపాద,ప్రియాంక శర్మ ఈ షెడ్యూల్లో పాల్గొన్నారని ఇన్సైడ్ టాక్.
ఇక రెండో షెడ్యూల్ జనవరి 3 నుంచి షురూ అయి జనవరి 12న ముగుస్తుందట. అంతేకాదు యశోదకు సంబంధించిన చివరి షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా కొనసాగనుందని తెలుస్తోండగా..జనవరి 20 నుంచి మార్చి 31వరకు ఈ షూటింగ్ జరుగునున్నట్టు టాక్. యశోద చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), ఉన్ని ముకుందన్ (Unni Mukundan), మురళీ శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్బింగ్ చేయనున్నట్టు సమాచారం. 2022లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.