Samantha | ఈ నెలలో చిన్న సినిమాలుగా ప్రేక్షకులకు ముందుకొచ్చి వినోదాన్ని అందిస్తున్న వాటిలో ముందు వరుసలో ఉంటాయి సింగిల్ (#Single), శుభం (Subham). కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు శ్రీవిష్ణు. ఈ క్రేజీ నటుడి కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం సింగిల్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇండియాతోపాటు ఓవర్సీస్లోనూ మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
ఈ మూవీ నార్త్ అమెరికాలో రూ.5 కోట్లపైన గ్రాస్ రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక సమంత ప్రొడక్షన్ వెంచర్ శుభం. హార్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన శుభం మూవీ ఇండియాలో సింగిల్ సినిమాతో పోటీ ఉన్న కారణంగా కొంచెం నెమ్మదించినా.. నార్త్ అమెరికాలో మాత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ మూవీ యూస్‌లో రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్.
ఈ ఫిగర్‌తో బ్రేక్ఈవెన్ పూర్తి చేయడమే కాదు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. సమంతకు నిర్మాతగా మంచి ఉపశమయనం కల్పించే విషయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న సినిమాలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో మంచి లాభాలు తెచ్చిపెడతాయని మరోసారి నిరూపిస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ యాక్టర్లు యూఎస్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ బాటలో పయనించడం మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
Raashi Khanna | సినిమాలంటే ఆసక్తి లేదట.. తన రూంమేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన రాశీఖన్నా
Ruchi Gujjar | మోదీ నెక్లెస్‌తో కేన్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ భామ.. అందరి చూపు ఆమె వైపే
Thug life | ముంబైలో కమల్‌హాసన్, శింబు థగ్‌లైఫ్ టీం.. ట్రెండింగ్‌లో స్టిల్స్