e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Samantha | అప్పుడు నాకు చావు త‌ప్ప ఇంకో మార్గం లేదు : స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Samantha | అప్పుడు నాకు చావు త‌ప్ప ఇంకో మార్గం లేదు : స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Samantha opens up on divorce | టాలీవుడ్‌లో గ‌త కొన్ని రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం ఏంటో తెలుసు క‌దా. నాగ చైత‌న్య‌, స‌మంత విడాకుల విష‌యం. చైసామ్.. విడాకులు తీసుకుంటున్నార‌ని వాళ్లు విడాకులు తీసుకోక‌ముందే సోష‌ల్ మీడియా కోడై కూసింది. అవి నిజ‌మా.. కాదా.. అస‌లు వాళ్లిద్ద‌రూ విడాకులు ఎందుకు తీసుకుంటారు అని అంతా టెన్ష‌న్ ప‌డుతున్న స‌మ‌యంలోనే నాగ చైత‌న్య‌, స‌మంత‌.. ఇద్ద‌రూ ఇన్‌స్టాగ్రామ్‌లో తాము విడిపోతున్న‌ట్టు జాయింట్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దీంతో సినీ అభిమానులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.

Samantha opens up on divorce
Samantha opens up on divorce

పెళ్లి అయి మూడునాలుగేళ్లు కూడా కాలేదు.. విడాకులు తీసుకోవ‌డం ఏంటి.. అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. తాము విడిపోతున్న‌ట్టు అక్టోబ‌ర్‌లో ప్ర‌క‌టించింది ఈ జంట‌. ఆ త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల్లో త‌మ విడాకుల గురించి చాలా అరుదుగా స్పందిస్తూ వ‌స్తున్నారు చైతూ, సామ్.

- Advertisement -

తాజాగా.. ఫిలిం ఫేర్ ఇంట‌ర్వ్యూలో స‌మంత‌.. త‌న విడాకుల గురించి స్పందించింది. త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను త‌న అభిమానుల‌కు చెప్పింది. విడాకుల తీసుకున్న త‌ర్వాత తాను ఇక బ‌త‌క‌లేనేమో.. తాను తీవ్రంగా కుంగిపోతానేమో అని అనుకున్న‌ద‌ట. ఇక త‌న జీవితానికి పుల్‌స్టాప్ ప‌డిన‌ట్టే అని స‌మంత తెగ భ‌య‌ప‌డిపోయిందట‌.

జీవితంలో కొన్ని రోజులు మ‌న‌కు ఎంతో బాధ‌ను క‌లిగిస్తాయి. అవి కామ‌న్. మ‌నం అర్థం చేసుకోవాలి. నీ క‌ష్టాల‌ను నువ్వు అర్థం చేసుకొని ముంద‌డుగు వేస్తే చాలు.. స‌గం క‌ష్టాలు తీరిన‌ట్టే. ఆ క‌ష్టాల‌ను, బాధ‌ను అర్థం చేసుకోక‌పోతే.. ఒప్పుకోక‌పోతే.. వాటి మ‌ధ్యే న‌లిగిపోతూ ఉంటే.. జీవితం ముందుకు సాగ‌దు.. అంటూ స‌మంత‌.. త‌న విడాకుల గురించి చెప్పుకొచ్చింది.

నా వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా.. నేను నా జీవితాన్ని ముందుకు న‌డిపిస్తున్నాను. అయితే.. నేను ఇంత స్ట్రాంగ్ అని త‌ర్వాత తెలిసింది. అంత‌కుముందు నేను చాలా పిరికిదాన్ని అని అనుకునేదాన్ని. ప్ర‌తి చిన్న విష‌యాన్ని భ‌య‌ప‌డిపోతా అని అనుకునేదాన్ని. విడాకులు తీసుకుంటే అస‌లు నేను బ‌తుకుతానా. నా జీవితం మ‌ళ్లీ సాగుతుందా.. అని అనుకున్నా. కానీ.. నాకు ఇంత ధైర్యం ఉంద‌ని.. నా జీవితంలో ఇటువంటి క‌ష్టాలు, అడ్డంకులు ఎన్ని వ‌చ్చినా.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ల‌గ‌ల‌ను.. అనే భ‌రోసా నాకు అప్పుడే వ‌చ్చేసింది. అది నాకు చాలా గ‌ర్వంగా ఉంది.. అంటూ స‌మంత స్ప‌ష్టం చేసింది.

2017 లో గోవాలో సమంత‌, నాగ చైత‌న్య పెళ్లి అంగ‌రంగ‌వైభవంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. అంత‌కుముందే వాళ్లు చాలా ఏళ్ల పాటు రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత పెళ్లి పీట‌లు ఎక్కారు. పెళ్లి పీట‌లు ఎక్కిన నాలుగేళ్ల‌కే అక్టోబ‌ర్ 2, 2021న ఎవ‌రి దారి వాళ్లు చూసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Vicky katrina Wedding Updates | విక్కీకౌశ‌ల్‌-క‌త్రినా వెడ్డింగ్ అప్‌డేట్స్

Daniel sekhar meets Kurien | ‘కురియ‌న్’ను క‌లిసిన ‘డానియ‌ల్ శేఖ‌ర్‌’..ఇంత‌కీ ఇక్క‌డో తెలుసా..?

Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మ‌రో మ్యాజిక్‌..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్

Mangli Kollywood debut | రూటు మార్చిన సింగ‌ర్ మంగ్లీ..!

Mahesh family with star director | స్టార్ డైరెక్ట‌ర్ ఫ్యామిలీతో మ‌హేశ్‌బాబు క‌పుల్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement