Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అనారోగ్యం కారణంగా గత కొంతకాలం నుంచి నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్. చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. అయితే మళ్లీ తాను సినిమాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
సమంత మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి షూటింగ్లో పాల్గోనబోతున్న. దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందులోని పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా. ఇప్పటికే ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్, అర్చరీ వంటివి నేర్చుకుంటున్నా. నాకు కూడా త్వరగా సెట్ అవ్వాలని ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 ఏళ్లలో చాలా ఒడిదుడుకులు అనుభవించాను. ముఖ్యంగా కిందపడి పైకి లేచాను. అయితే మళ్లీ నేను కొత్తగా రెడీ అవుతున్నా. ఒక స్టూడెంట్‌లా మళ్లీ కెమెరా ముందుకు రావాలి అనుకుంటున్నా అంటూ సామ్ వెల్లడించింది.
ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ చిత్రం అనంతరం మలయాళంలో మెగాస్టార్ మమ్ముట్టితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు గౌతమ్ వాస్దేవ్ మీనన్ దర్శకత్వం వహించబోతున్నాడు. మరోవైపు ఈ సినిమాతో పాటు ‘మా ఇంటి బంగారం’ సినిమాను అనౌన్స్ చేసింది. తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
Also Read..