Jayaraj | ప్రముఖ కవి జయరాజ్కు గుండెపోటు..
ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ (Jayaraj) గుండెపోటుకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు.
హైదరాబాద్: ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ (Jayaraj) గుండెపోటుకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. కాగా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషికిగాను తెలంగాణ ప్రభుత్వం 2023లో కాళోజీ నారాయణ రావు అవార్డును అందించిన విషయం తెలిసిందే.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి కవిగా పేరు తెచ్చుకున్నారు. మహబూబాబాద్ మండలం గుమ్మనూర్ లో గోడిశాల చెన్నమ్మ, గొడిశాల కిష్టయ్య దంపతులకు జన్మించారు జయరాజ్. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. పేద దళితకుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షలేని సమాజం కోసం కృషి చేశారు. బుద్ధుడి బోధనల ప్రభావం ఆయనపై చాలానే ఉంది. అంబేద్కర్ రచనలతో స్ఫూర్తి పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లెల్లో తిరుగుతూ తన ఆటపాటల ద్వారా ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని రగిలించారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రాశారు. మనిషికీ, ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెనా తిరుగుతూ.. తన ఆట పాట గానం ద్వారా ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించిన ప్రజా కవిగా జయరాజు కృషి చేశారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. మనిషికీ ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. ఈ మేరకు వారు ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.
పాటలు..
తెలంగాణ బతుకు ఛిధ్రమైన జాడను తన పాటల్లో పట్టి చూపించిండు. ప్రజల గుండెల్లో చిరకాలం యాదికుండే పాటలు రాసిన జానపద గాయకుడు విప్లవోద్యమంలో అనేక పాటలకు ప్రాణం పోసిండు. పోరాడకుంటే బతుకు మారదని, తన పాటలు, రచనల ద్వారా ప్రజలకు దోపిడి మర్మాన్ని విప్పి చెప్పిండు. జయరాజు పాటలు ప్రజలను ఉద్యమ బాటలో నడిపిస్తయి. జోలాలీ పాటవింటే వందకోట్ల భారతీయుల కన్నీటి కథ మన కండ్లముందు ఉంటది. తన స్నేహితుడు చేరాల కనుమూసినపుడు ‘ నిన్నెట్టా మరిచిపోదును చేరాల..’ అన్న పాట ఆయన కలం నుంచి పట్టిన తొలి పల్లవి. కాచినపల్లి ఎన్కౌంటర్ పై రాసిన పాట ప్రతి హృదయాన్ని కదిలించింది. ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పాలకుల పీడనవంటి దీర్ఘకాలిక సమస్యలను పాటగట్టి జనాన్ని పోరుబాట పట్టిచ్చిండు.
సినిమాలకు కూడా..
అడవిలో అన్న సినిమాకు హైలెట్గా నిలిచిన ‘వందనాలమ్మ పాట’ జయరాజ్ కలం నుంచి వచ్చిందే. దండోరా సినిమాలోని కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాటను జయరాజ్ రాశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

