Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన చిత్రం మజిలీ (Majili). శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ ఆల్‌టైమ్ తెలుగు సూపర్‌హిట్ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ కపుల్ రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా కాంబినేషన్లో మరాఠీలో వేద్ (Ved) టైటిల్‌తో రీమేక్ చేశారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
థియేటర్లలో మిస్సయిన వారి కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంలో సందడి చేసేందుకు రెడీ అయింది వేద్. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ +హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. వేద్ మరాఠీతోపాటు హిందీలో కూడా అందుబాటులో ఉండనుందని ఓటీటీ ప్లాట్‌ఫాం తెలియజేసింది. వేద్ చిత్రంలో జియా శంకర్, అశోక్ సరఫ్, విద్యాధర్ కీలక పాత్రల్లో నటించారు. అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
రితేశ్ దేశ్‌ముఖ్ ప్రస్తుతం Kakuda, Visfot టైటిల్స్ తో వస్తున్న రెండు హిందీ చిత్రాల్లో నటిస్తుండగా.. ఈ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరోవైపు జెనీలియా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న జూనియర్లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తెలుగులో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తుండటంతో.. చాలా కథలను వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారని తెలిసిందే. మజిలీలో రియల్ లైఫ్ కఫుల్ (ప్రస్తుతం మాజీ కపుల్) అయిన సమంత, నాగచైతన్య నటించగా.. వేద్‌లో కూడా రియల్ లైఫ్ కపుల్ జెనీలియా-రితేశ్ దేశ్ ముఖ్ కలిసి నటించడం విశేషం.
వేద్ ట్రైలర్..
Pyaar ke pagalpan ki koi seema nahi hoti❤️#Ved streaming from April 28.@riteishd @geneliad #JiyaaShankar @mfc @deshmusiclabel @warnermusicIN@AjayAtulOnline @TawdeShubhankar pic.twitter.com/BErSKZEiFz
— Disney+ Hotstar (@DisneyPlusHS) April 13, 2023
Vikram | నువ్వు ఎప్పుడూ విఫలం కావు మహీ.. ట్రెండింగ్‌లో విక్రమ్, ధోనీ స్టిల్
SAINDHAV | సైంధవ్ షూటింగ్ అప్డేట్.. వెంకటేశ్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?