Ravi Babu | టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ల లిస్టులో టాప్‌లో ఉంటాడు రవిబాబు (Ravi Babu). రొమాంటిక్ కామెడీ ప్రాజెక్ట్ అల్లరి, యాక్షన్ థ్రిల్లర్ అనసూయ, హార్రర్ మూవీ అవును.. ఇలా జోనర్ ఏదైనా ప్రేక్షకులకు కావాల్సిన థ్రిల్‌ను అందించే ప్రయత్నంలో రవిబాబు ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా రవిబాబు కథనందిస్తూ.. వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన చిత్రం అసలు (Asalu).. ఓటీటీ ప్లాట్‌ఫాం ETV WINలో విడుదలైంది. ఈ చిత్రంలో మరోసారి పూర్ణ (Poorna) లీడ్ రోల్లో నటిస్తోంది.
రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును చిత్రం పూర్ణకు హీరోయిన్గా మంచి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత రవిబాబు, పూర్ణ కాంబినేషన్ రిపీట్ అవుతూ వస్తోంది. రవిబాబు డైరెక్ట్ చేసిన అవును 2, లడ్డూబాబు చిత్రాల్లో కూడా పూర్ణ లీడ్ రోల్స్ లో మెరిసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ పుకార్లు షికారు చేశాయి.
లవ్ ఎఫైర్ వార్తల నేపథ్యంలో పూర్ణతో మరోసారి అసలు ప్రాజెక్ట్ చేయడం గురించి రవిబాబు స్పందిస్తూ.. సిల్వర్ స్క్రీన్‌పై నిజంగా చూసే దాని కంటే 200 శాతం ఉత్తమ అవుట్‌పుట్‌ను అందించే ప్రత్యేక నటులను ఇష్టపడే దర్శకులకు ఇది సాధారణమైన విషయం. పూర్ణ కూడా అలాంటి రత్నమే. నేను కూడా పూర్ణతో ఇలాంటి ప్రేమ వ్యవహారాన్ని కలిగి ఉన్నా.. కానీ జనాలు అనుకుంటున్నది కాదు.. అన్నాడు రవిబాబు.
ఉత్తమ యాక్టింగ్ కనబరిచే ఏ యాక్టర్లతోనైనా డైరెక్టర్లు ప్రేమలో పడతారని తనదైన స్టైల్లో చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశాడు రవిబాబు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన అసలు చిత్రాన్ని రవిబాబు అసిస్టెంట్స్ ఉదయ్ -సురేశ్ డైరెక్ట్ చేశారు.
SAINDHAV | సైంధవ్ షూటింగ్ అప్డేట్.. వెంకటేశ్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?