Leo | పసివాడి ప్రాణం సినిమాతో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మలయాళ నటుడు బాబు ఆంటోనీ (Babu Antony). ఈ సినిమాలో బాబు ఆంటోనీ విలనిజం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత జేబు దొంగ, త్రినేత్రుడు, లారీ డ్రైవర్ సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడైన బాబు ఆంటోనీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న లియో (Leo.. Bloody Sweet) చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాబు ఆంటోనీ ఇవాళ లియో షూటింగ్లో పాల్గొన్నాడు.
బాబు ఆంటోనీ తొలి రోజు విజయ్‌తో లియో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నాడు. విజయ్ నిరాడంబరమైన వ్యక్తి.. అతను నా పనికి అభిమాని అని చెప్పాడు. లోకేష్, నిర్మాత కూడా నాకు అదే చెప్పారని అన్నాడు బాబు ఆంటోనీ. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్న లియో నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. లియో ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
దళపతి 67గా వస్తున్న ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. లియో చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Vijay is a humble person, he told me that he is a fan of my work… Even Lokesh & the producer told me the same…!
Says Mollywood actor #BabuAntony about his first day experience in #Leo film location… pic.twitter.com/KmyTx0h2I4
— AB George (@AbGeorge_) April 13, 2023
లియో టైటిల్ ప్రోమో..
దళపతి 67 సర్ప్రైజ్..
SAINDHAV | సైంధవ్ షూటింగ్ అప్డేట్.. వెంకటేశ్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?