ఖాట్మండు, సెప్టెంబర్ 26: నేపాల్ మధ్య, ఉత్తర జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించిన నెల రోజుల తర్వాత నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఆర్ఆర్ఎంయే) తెలిపిన వివరాల ప్రకారం కనీసం 1,453 మంది మరణించారు. 5,285 మంది ఆచూకీ తెలియకుండా పోయారు. ఇప్పటివరకు 1,451 మంది మృతదేహాలను వెలికితీశామని, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని అథారిటీ తెలిపింది.
ఇప్పటివరకు మొత్తం 13,795 మందిని రక్షించినట్టు శనివారం అథారిటీ పేర్కొంది. చైనా మీడియా కథనం ప్రకారం ఈ విపత్తు కారణంగా టిబెట్లో 43 మంది మరణించగా 500 మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వరదల బారిన పడ్డ 11,000 మందికి భద్రతా సంస్థలు ఇప్పటివరకు వైద్య చికిత్స అందించాయి.