Chiyaan Vikram | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). గతేడాది భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ 1లో ఆదిత్య కరికాలన్ పాత్రతో ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. త్వరలోనే మరోసారి పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyin Selvan 2) లో మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. పార్ట్-2లో ఐశ్వర్యారాయ్, విక్రమ్ మధ్య ఎలాంటి సీక్వెన్స్ ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. ఇదిలా ఉంటే విక్రమ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
నువ్వు అందరినీ ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ విఫలం కావు మహి.. అని క్యాప్షన్ ఇచ్చాడు విక్రమ్ . బుధవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ధోనీ టీం కొంత మార్జిన్‌లోనే ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ధోనీ ఆట చివరి వరకు పడిన శ్రమకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా ధోనీతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ధోనీని ప్రశంసిస్తూ విక్రమ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. విక్రమ్ మరోవైపు పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
You never fail to amaze Mahi. 🔥 @msdhoni pic.twitter.com/HuVIp5KqSm
— Vikram (@chiyaan) April 13, 2023
SAINDHAV | సైంధవ్ షూటింగ్ అప్డేట్.. వెంకటేశ్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?