Sam CS | టాలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్లలో టాప్‌లో ఉంటారు దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), శ్యామ్ సీఎస్ (Sam CS). ఈ ఇద్దరు తమ సినిమాలతో టాలీవుడ్ హిట్ సాంగ్ అందించారని తెలిసిందే. అయితే అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇద్దరి మధ్య పరోక్షంగా వారే నడించిందని చెప్పాలి.
పుష్ప 2 కంపోజిషన్ వచ్చేసరికి మేకర్స్‌కు, డీఎస్పీకి మనస్పర్థలు రావడం, ఇతర కారణాల వల్ల ఈ సినిమా టీంతో మరో మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ కూడా జాయిన్ అయ్యాడు. రిలీజ్‌కు ముందు శ్యామ్ సీఎస్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
పనిని మొదలుపెట్టేముందు నేను స్క్రిప్ట్‌ను చదవలేదు. ఎందుకంటే ఎడిటింగ్ అయిన తర్వాత టీంలో జాయిన్ అయ్యా. అయితే నేను సినిమా మొత్తానికి సంగీతం అందించా. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో మేకర్స్ కొంత భాగాన్ని ఉంచినప్పటికీ.. క్లైమాక్స్ ఫైట్‌తోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో 90 శాతం క్రెడిట్ నాదేనన్నాడు శ్యామ్ సీఎస్.
పుష్ప 2 భారీ ప్రాజెక్ట్. ప్రేక్షకుల దృష్టికోణంలోనే సినిమాను తెరకెక్కించా. నేను పుష్ప 2 కోసం పైపు పరికరాలను ఉపయోగించాను. ఏఐని ఉపయోగించి వాయిస్‌ని సృష్టించి.. దాని ఇన్స్ట్రుమెంటల్గా మార్చాను. ఇది ఫ్రెష్ సౌండ్ ఫీల్ ఇస్తుంది. ప్రజలు ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చాడు శామ్ సీఎస్. అయితే ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్‌దేనని చెప్పిన శ్యామ్.. నిర్మాణ పనులు త్వరగా ముగించాల్సి రావడంతో మేకర్స్ తనను టీంలోకి తీసుకొచ్చారని శ్యామ్ చెప్పాడు.
ఇప్పడు శ్యామ్ సీఎస్, డీఎస్పీ కంపోజ్ చేసిన ఓఎస్టీలు ప్రేక్షకుల ముందుకొచ్చేశాయి. ఈ నేపథ్యంలో శ్యామ్ సీఎస్ చేసిన కామెంట్స్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. శ్యామ్ మొత్తం 16 నిమిషాల 18 సెకన్ల నిడివి గల 18 ట్రాక్స్‌ను షేర్ చేయగా.. డీఎస్పీ ఓఎస్టీ జ్యూక్ బాక్స్ మాత్రం 33 నిమిషాల 29 సెకన్లుగా ఉంది.
ఈ లెక్కన దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కీలక సన్నివేశాలతోపాటు మెజారిటీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడని అర్థమవుతోంది. మరోవైపు శ్యామ్ సీఎస్ కూడా కీలక సన్నివేశాలకు స్కోర్ అందించనప్పటికీ.. అతను చెప్పినట్టుగా 90 శాతం మాత్రం కాదని అర్థమవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ
VD14 | రిపబ్లిక్ డే స్పెషల్.. కీ అప్డేట్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ టీం
Shafi | పది రోజులుగా వెంటిలేటర్‌పై.. ప్రముఖ దర్శకుడు షఫీ మృతి