శనివారం 06 జూన్ 2020
Cinema - May 14, 2020 , 04:54:42

ఆన్‌లైన్‌లో జిమ్ పాఠాలు నేర్చుకుంటున్న స‌మంత‌

ఆన్‌లైన్‌లో జిమ్ పాఠాలు నేర్చుకుంటున్న స‌మంత‌

ఇప్ప‌టి హీరోయిన్స్ వ‌ర్క‌వుట్స్ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్‌, మంచు ల‌క్ష్మీ, స‌మంత ఇలా చాలా మంది భామ‌లు ఎక్కువ స‌మ‌యాన్ని జిమ్‌కే కేటాయిస్తుంటారు. అయితే లాక్‌డౌన్ వ‌ల‌న జిమ్స్ అన్నీ మూత‌ప‌డ‌డంతో కొంద‌రు స్వ‌యంగా వ‌ర్క‌వుట్స్ చేస్తున్నారు. కాని స‌మంత మాత్రం ఆన్లైన్ వర్కౌట్స్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

లాక్‌డౌవ‌న్ వ‌ల‌న ట్రైన‌ర్ త‌న ఇంటికి వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో ఫిట్ నెస్ ట్రైన‌ర్ సందీప్ రాజ్ వీడియా కాల్ ద్వారా స‌మంత‌కి టిప్స్ చెబుతున్నారట‌. ఆయ‌న సూచ‌న‌లు పాటిస్తూ స‌మంత తాను చేస్తున్న వ‌ర్క‌వుట్స్ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మ‌రో వైపు స‌మంత తన న‌ట‌న‌ని మరింత మెరుగుప‌ర‌చుకునేందుకు ఆన్‌లైన్ క్లాసెస్ వింటుంది. రానున్న రోజుల‌లో నా న‌ట‌న‌లో మ‌రింత ప‌రిణితి చూస్తార‌ని ఇటీవ‌ల కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. 


logo