Salman Khan Video | సల్లూ భాయ్ అది వోడ్కానా? నీళ్లా?
బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ది ఓ వెరైటీ స్టైల్. ఎప్పుడూ ఏదో ఒక న్యూలుక్‌తో కనిపిస్తుంటాడు. అయితే, ఈ సారి మరింత వెరైటీగా కెమెరాకు చిక్కాడు. తన జీన్స్ ప్యాంటు జేబులో గాజు గ్లాసుతో ప్రత్యక్షమయ్యాడు. ఏదో ద్రవపదార్థమున్న గ్లాసును ఓ జేబులోంచి మరో జేబులోకి మార్చుకుంటూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ది ఓ వెరైటీ స్టైల్. ఎప్పుడూ ఏదో ఒక న్యూలుక్‌తో కనిపిస్తుంటాడు. అయితే, ఈ సారి మరింత వెరైటీగా కెమెరాకు చిక్కాడు. తన జీన్స్ ప్యాంటు జేబులో గాజు గ్లాసుతో ప్రత్యక్షమయ్యాడు. ఏదో ద్రవపదార్థమున్న గ్లాసును ఓ జేబులోంచి మరో జేబులోకి మార్చుకుంటూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిర్మాత మురాద్ ఖేతానీ పుట్టినరోజు వేడుకకు సల్మాన్ వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కారు దిగేటప్పుడు సల్మాన్‌ఖాన్ తన జీన్స్ ప్యాంటు ఎడమ జేబులోంచి ద్రవపదార్థంతో సగం నింపిన గ్లాసును తీసి కుడి జేబులోకి మార్చుకున్నాడు. గ్లాసును కవర్ చేస్తూ ఈవెంట్‌కు వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో అభిమానులు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. ‘సల్లూభాయ్ గ్లాసులో ఏంటి వోడ్కానా? లేదా మంచినీళ్లా?’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘ప్యాంట్ జేబులో గాజు.. భాయ్ కొత్త స్టైల్’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
Glass in pants pocket😁 new style of bhai #SalmanKhan @BeingSalmanKhan pic.twitter.com/tpjFL5JlBD
— Devil V!SHAL (@VishalRC007) September 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

