Baby John | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. ఓ వైపు లీడ్ యాక్టర్‌గా చేస్తూనే.. మరోవైపు కామియో రోల్లో కూడా కనిపించబోతున్నాడు. ఈ స్టార్ యాక్టర్ గెస్ట్ రోల్లో నటిస్తున్న చిత్రం బేబీ జాన్ (Baby John). నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ వరుణ్ ధవన్ (Varun Dhawan) లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ ఈ మూవీ షూట్లో ఎప్పుడు జాయిన్ అవుతాడనే దానిపై ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. తాజా టాక్ ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో బేబిజాన్ చిత్రీకరణలో జాయిన్ కాబోతున్నాడు. ఈ షెడ్యూల్లో వరుణ్ ధవన్, సల్మాన్ ఖాన్‌పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నారట. Kalees డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
ఈ చిత్రంలో వామికా గబ్బి మరో హీరోయిన్గా నటిస్తోంది. బేబిజాన్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సినీ1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియాఅట్లీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
EXCLUSIVE!! #SalmanKhan to shoot for his #BabyJohn cameo in the FIRST WEEK OF OCTOBER.. He will appear alongside @Varun_dvn in an action-packed sequence…
Meanwhile, a five-minute footage of the film was shown today at Big Cine Expo 2024 to a thundering response from everyone! pic.twitter.com/Q2ycxddYyP
— Rahul Raut (@Rahulrautwrites) September 30, 2024
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్