రాధే సినిమాకు రికార్డు స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్లు.. రెండో రోజు మాత్రం తుస్
మే 13న జీ5 యాప్ ద్వారా విడుదలైన రాధే సినిమాకు తొలి రోజే 4.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతిసారి రంజాన్ పండుగకు ఒక సినిమాను విడుదల చేయడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. వాటికి రికార్డు వసూళ్లు కూడా వస్తుంటాయి. అలాగే ఈసారి ఈద్‌కు రాధే సినిమాతో వచ్చాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామని మొదట అనుకున్నా కరోనా కారణంగా కేవలం ఓటీటీలోనే విడుదలైంది. మే 13న జీ5 యాప్ ద్వారా విడుదలైన రాధే సినిమాకు తొలి రోజే 4.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక్కొక్క టికెట్ 249 రూపాయలు.. రాధే సినిమా కోసం జీ 5 వాళ్లు వన్ ఇయర్ సబ్క్రిప్షన్ 499 కాంబో ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ లెక్కన ఫస్ట్ డే రూ.109 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు లెక్క కడుతున్నారు. అయితే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

ఓటీటీలో పే పర్ వ్యూ నుంచి కూడా మంచి వసూళ్లు తీసుకురావచ్చు అని రాధే తొలి రోజు కలెక్షన్లు నిరూపించాయి. అయితే సినిమాకు అత్యంత చెత్త టాక్ రావడంతో రాధే సినిమాను రెండో రోజు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీనికితోడు బాయ్‌కాట్ సెగ కూడా ఈ సినిమాకు తగిలింది. బాయ్‌కాట్ రాధే అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌టాగ్ కూడా ట్రెండ్ అయింది. పైగా సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సినిమా పైరసీ బయటకొచ్చేసింది. దీంతో రెండో రోజు కలెక్షన్లు తుస్ అనిపించాయి. టాక్ బాగుండుంటే మాత్రం కలెక్షన్లు వేరేలా ఉండేవి.
రాధే సినిమాకు ప్రభుదేవా దర్శకుడు. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సిటీమార్ పాటను కాపీ చేశారు. దీంతో మన వాళ్లు కూడా ఈ సినిమాపై కాస్త ఆసక్తి చూపించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దారుణంగా నిరాశ పరిచాడు మోస్ట్ వాంటెడ్ భాయ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జాతిరత్నం హీరోయిన్ గ్లామర్ పిక్స్.. వైరల్
రాధేతో నిరాశపరచిన ప్రభుదేవా..డైరెక్షన్‌కు బైబై చెప్పాలంటూ సూచన!
విష్ణు ప్రియ గ్లామర్ షో.. యువత ఫిదా
మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ మీ ముందుంటుంది: సోనూసూద్
నటి సోదరుడు, ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
కెరీర్ కోసం ప్రేయసికి దూరంగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
రెండవ డోసు కోవిడ్ టీకా తీసుకున్న సల్మాన్ ఖాన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

