Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సికందర్ (Sikandar). ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇందులో రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ మార్చి 30న ఈద్ పండుగ కానుకగా థియేటర్లలోకి రానుంది. అయితే, ఈ సినిమాలో రష్మిక, సల్మాన్ మధ్య ఏజ్ గ్యాప్‌పై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఏజ్ గ్యాప్ వివాదంపై సల్మాన్ స్పందించారు. ఈ మేరకు విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నాకు, హీరోయిన్ రష్మికకు మధ్య దాదాపు 31 ఏళ్ల వయసు తేడా ఉందని కొందరు అంటున్నారు. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఆమె తండ్రికి కూడా సమస్య లేదు. వాళ్లకే లేని సమస్య మీకు ఎందుకు..? రష్మికకు పెళ్లయ్యాక ఆమె కూతురితో కూడా నటిస్తా. వాళ్లకు లేని ప్రాబ్లమ్స్ మీకెందుకు..?’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం సల్మాన్ రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో సికందర్ (Sikandar) ఒకటి. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబో ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది.
ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో ఓ స్థాయిలో వెలిగిపోతోంది. ‘యానిమల్’తో యువతరానికి కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో స్టార్ హీరోయిన్గా అవరించింది. ఇక ‘ఛావా’తో నటిగా కూడా కితాబులందుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సికందర్ కూడా హిట్ అయితే.. ఇక రష్మికను బాలీవుడ్లో ఆపటం కష్టమే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Also Read..
Rajinikanth | ఉగ్రవాదులు సముద్రం ద్వారా చొరబడతారు.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రజనీకాంత్
Shyamala | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. విచారణకు హాజరైన శ్యామల
David Warner| తెలుగులో మాట్లాడి తెగ నవ్వించిన వార్నర్ మామ.. ఇంతకీ ఏం మాట్లాడాడంటే..!