David Warner| తెలుగులో మాట్లాడి తెగ నవ్వించిన వార్నర్ మామ.. ఇంతకీ ఏం మాట్లాడాడంటే..!
David Warner| క్రికెట్ అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ ఐపీఎల్లోను సందడి చేశాడు.
David Warner| క్రికెట్ అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ ఐపీఎల్లోను సందడి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కొన్నాళ్లు ఆడిన వార్నర్ 2016లో ట్రోఫీ కూడా అందించి పెట్టాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ జట్టు ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. అయితే వార్నర్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగుల్లో ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ స్టార్ ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. ఇది ఆయన ఫ్యాన్స్ ని చాలా నిరాశపరిచింది.
అయితే ఐపీఎల్‌కు దూరం అయినప్పటికి తెలుగు వారికి మంచి వినోదం పంచాలని డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ అనే మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఈ పాత్ర మొమోరబుల్గా ఉంటుందని తెలుస్తుంది. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రలలో వెంకీ కుడుముల రూపొందించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత రాత్రి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకకి డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు. ఈవెంట్లో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ అందరికి నమస్కారం అంటూ పలకరించాడు. గత కొన్నాళ్లుగా తనపై అందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నాడు.
సినీ ఇండస్ట్రీలో వచ్చేందుకు కొంచెం భయపడినట్లుగా చెప్పిన డేవిడ్ వార్నర్… రాబిన్ హుడ్ టీమ్ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందన్నాడు. ఇక ఈ చిత్రంతో మీ కుటుంబంలో నన్ను చేర్చుకున్నందుకు ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉందని తెలియజేశాడు. మూవీ టీమ్ ఎంతో కష్టపడింది కాబట్టి మూవీ పెద్ద విజయం సాధిస్తుందని తెలియజేశాడు. ఇక స్పీచ్ అనంతరం డేవిడ్ వార్నర్‌ని తెలుగులో ఏదైనా చెప్పమని అడిగారు దర్శకుడు వెంకీ. ఇందుకు “నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వెరైటీగా చెప్పి వార్నర్ అందరిని అలరించాడు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంతో డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులని ఎంతలా అలరిస్తాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

