Salman Khan | బాలీవుడ్ ‘భాయ్ జాన్’ సల్మాన్ ఖాన్ శనివారం (డిసెంబర్ 27) తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై సమీపంలోని పన్వేల్ ఫామ్‌హౌస్‌లో డిసెంబర్ 26 రాత్రి నుంచే భారీ స్థాయిలో బర్త్‌డే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. సల్మాన్ బర్త్‌డే పార్టీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి ధోనితో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ ఫామ్‌హౌస్‌కు చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకకి రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా హాజరై ఆకట్టుకున్నారు. జెనీలియా దేశ్‌ముఖ్ తన పిల్లలతో కలిసి వచ్చి ఫ్యామిలీ టచ్ ఇచ్చింది. హుమా ఖురేషి గ్లామరస్ లుక్‌లో మెరిసింది. సింగర్ మికా సింగ్ స్కూటీపై ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన మనీష్ పాల్‌తో పాటు, ఆయన మాజీ ప్రేయసి సంగీతా బిజ్లానీ కూడా పార్టీలో కనిపించడం విశేషంగా మారింది. నటుడు రణదీప్ హుడా తన నిండు గర్భిణి భార్య లిన్‌తో కలిసి హాజరయ్యాడు. సీనియర్ నటి టబు, నిర్మాత రమేష్ తౌరానీ, నిఖిల్ ద్వివేది, మహేష్ మంజ్రేకర్ తదితరులు కూడా పార్టీలో పాల్గొన్నారు.
ఖాన్ కుటుంబ సభ్యులు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్ (భార్య షురా, కూతురితో), సోహైల్ ఖాన్ పార్టీలో సందడి చేశారు. మేనల్లుళ్లు అహాన్, నిర్వాణ్ స్టైలిష్ లుక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ సోదరీమణులు కూడా తమ కుటుంబాలతో హాజరయ్యారు. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్ కోసం ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఆయనతో కలిసి పనిచేసిన దర్శకులు ఈ వీడియో ద్వారా భాయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పుట్టినరోజు కానుకగా అభిమానులకు ఓ శుభవార్తను ప్రకటించనున్నట్లు సమాచారం. సల్మాన్ నటిస్తున్న భారీ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ నుంచి ఒక కీలక అప్డేట్ విడుదల కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 60వ పడిలోకి అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుండగా, పన్వేల్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ గ్రాండ్ పార్టీ బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.