ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘సలార్’ సినిమా అదనపు షోల నిర్వహణతోపాటు టిక్కెట్టు రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది. రాష్ట్రంలోని 20 థియేటర్లలో 22వ తేదీ ఉదయం ఒంటిగంటకు బెనిఫిట్ షో నిర్వహణకు, అలాగే ఉదయం నాలుగు గంటలకు ఆరవ షో నిర్వహణకు అనుమతిస్తూ హోమ్‌శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
అలాగే, ఈ నెల 22నుంచి 28వ తేదీవరకు సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ రేట్లను రూ. 65, రూ. 100వరకు పెంచుకునేందుకు కూడా అనుమతించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘సలార్’ సినిమా టిక్కెట్ ధరలను అన్ని థియేటర్లలో పది రోజులపాటు రూ. 40 వరకు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది.