Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు (discharged from hospital). గత వారం సైఫ్ ఇంటికి చోరీకి వచ్చిన దుండగుడు నటుడిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి అనంతరం తీవ్ర గాయాలతో లీలావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆరు రోజుల చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. వారం పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సైఫ్‌కు వైద్యులు సూచించారు. అదేవిధంగా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండేందుకు ఎక్కువమంది ఆయన వద్దకు రాకుండా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు.
ఈనెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన దుండగులు ఆయనపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆరుసార్లు సైఫ్‌ను దుండగుడు కత్తితో పొడిచాడు. గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నటుడికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
మరోవైపు సైఫ్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (Mohammad Shariful Islam Shahzad)ను శనివారం అర్థరాత్రి 2.50గంటలకు థానేలోని హిరానంది ప్రాంతంలో అరెస్టు చేసి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు.
Also Read..
VD12 | విజయ్ దేవరకొండ వీడీ12 టీజర్ రెడీ.. రిలీజ్ టైం కూడా వచ్చేసింది
Madhavilatha | జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన మాధవీలత
Dil Raju wife | బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం : దిల్ రాజు భార్య తేజస్విని