The India House | టాలీవుడ్ నిఖిల్ (Nikhil siddhartha) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘ది ఇండియా హౌస్’ (The India House). స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) సమర్పిస్తున్నఈ సినిమాకు రామ్వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సయీ మంజ్రేకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
చాలా రోజుల తర్వాత మేకర్స్ ఫస్ట్ లుక్ రూపంలో ఆసక్తికర అప్డేట్ అందించారు. సయీ మంజ్రేకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ నుంచి ఆమె పాత్రను పరిచయం చేశారు. సయీ మంజ్రేకర్ ఇందులో సతి పాత్రలో నటిస్తుండగా.. నీలం రంగు చీరలో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తోంది.
1905 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో లవ్, రెవల్యూషనరీ ఎలిమెంట్స్‌తో సాగే కథాంశంతో ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ మూవీని వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మయాంక్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కర్ణాటకలోని హంపి విరూపాక్ష దేవాలయంలో పూజా కార్యక్రమాలతో మొదలు కాగా.. ఈ వీడియో ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతోంది.
భారతీయ కథను గ్లోబల్ ఆడియెన్స్‌కు అందిస్తుండటం ఎక్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమా ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుందంటూ రాంచరణ్ ఇప్పటికే ట్వీట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశాడని తెలిసిందే.
సయీ మంజ్రేకర్ బర్త్ డే స్పెషల్ లుక్..
Team #TheIndiaHouse wishes its ‘Sati’, the gorgeous @saieemmanjrekar a very Happy Birthday ✨#JaiMataDi #RevolutionIsBrewing #ThisIsYoungIndia @AlwaysRamCharan @actor_Nikhil @AnupamPKher @ramvamsikrishna @AbhishekOfficl @MayankOfficl @AAArtsOfficial @VMegaPictures_… pic.twitter.com/bsRnHe4c9u
— Shreyas Media (@shreyasgroup) December 24, 2024
ది ఇండియా హౌస్ పూజా సెర్మనీ..
Highlights from #TheIndiaHouse pooja ceremony held at the Virupaksha Temple, Hampi ✨
The team took the blessings of Lord Shiva before beginning their revolution ❤🔥#JaiMataDi #RevolutionIsBrewing #ThisIsYoungIndia @AlwaysRamCharan @actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/dHvpcOFQ9x
— BA Raju’s Team (@baraju_SuperHit) July 2, 2024
Max Trailer | ప్రతీ పకోడిగాడు సమాజ సేవకుడే.. స్టన్నింగ్‌గా కిచ్చా సుదీప్ మాక్స్ ట్రైలర్
Bollywood 2024 | బాలీవుడ్‌కు కలిసి వచ్చిన 2024.. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్ హిందీ సినిమాలివే..!
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్