సాయి సింహాద్రి నటిస్తూ నిర్మించిన కుటుంబ కథాచిత్రం ‘S/O’ (సన్ ఆఫ్). బత్తల సతీశ్ దర్శకుడు. సీనియర్ నటుడు వినోద్‌కుమార్ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించి, టీజర్‌ని విడుదల చేశారు.
ఓ కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడు? అనే స్ట్రాంగ్ పాయింట్‌తో ఈ సినిమా రూపొందిందని దర్శకుడు చెప్పారు. నిర్మాత, హీరో సాయిసింహాద్రి మాట్లాడుతూ ‘నాకూ, నా తండ్రికీ కనెక్టయ్యే కథ ఇది. ఆద్యంతం ఆసక్తిని కలిగించేలా డ్రామా, ఎమోషన్స్‌తో కథ ఉంటుంది.
తండ్రికి ప్రతీకొడుకూ చూపించాల్సిన సినిమా ఇది’ అని పేర్కొన్నారు. పాషన్‌తో చేసిన సినిమా ఇదని, రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా, స్క్రీన్‌ప్లే బేస్డ్గా ఈ సినిమా సాగుతుందని సీనియర్ నటుడు వినోద్‌కుమార్ తెలిపారు. మీరా రాజ్, వాసు ఇంటూరి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.ఆర్.కె.నాయుడు, సంగీతం: రిషి.ఎం, నిర్మాణం: సాయి సింహాద్రి సైన్మా.