సీతగా సాయిపల్లవి నటిస్తున్నదని తెలిసినప్పట్నుంచీ సీతగా ఆమెను రకరకాల గెటప్పుల్లో టెక్నాలజీని ఉపయోగించి ఊహా చిత్రాలను గీసేసుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో కాషాయ వస్ర్తాలతో ఉన్న సాయిపల్లవి ఏఐ ఇమేజ్‌లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి తోడు ముంబయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ అభిమానితో పొరపాటున ఫొటో దిగింది సాయిపల్లవి. అతను ఆ ఫొటోను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు.
సాయిపల్లవి ప్రస్తుతం ముంబయ్‌లో ఉన్నారంటూ తనతో దిగిన ఫొటో కింద రాశాడు. అంతే.. ఇక తాను చేయబోతున్న ‘రామాయణం’ సినిమా ప్రారంభం కానుందంటూ ప్రచారం జోరందుకుంది. అసలు విషయానికొస్తే.. ఈ సినిమాను దర్శకుడు నితీశ్ తివారీ రెండు భాగాలుగా తెరకెక్కించాలనే భావనతో ఉన్నారు.
తొలిభాగం షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుకానుంది. దీనికోసం శ్రీలంకలో భారీ సెట్‌ను కూడా నిర్మించినట్టు విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకూ ఈ షెడ్యూల్ జరుగనుంది. రణబీర్‌కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, మధు మంతెన నిర్మాతలు.