కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాయిపల్లవి బికినీ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. అవి రియల్ అని కొందరు. కాదు ఫేక్ అని మరికొందరు.. సోషల్ మీడియా అంతా ఇవే వాదనలు. ఇంత వివాదం జరుగుతున్నా.. సాయిపల్లవి మాత్రం సైలెంట్‌గా ఉంది. దాంతో అవి నిజం కాబట్టే సాయిపల్లవి సైలెంట్‌గా ఉందంటూ పోస్టులు పెట్టారు. అయితే.. ఎట్టకేలకు తన బికినీ ఫొటోలపై సాయిపల్లవి క్లారిటీ ఇచ్చింది. షూటింగ్‌కి కాస్త గ్యాప్ రాగానే చెల్లి పూజా కన్నన్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్లింది సాయిపల్లవి. ఈ క్రమంలోనే తను బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసింది.
దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను సాయిపల్లవి తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ‘ఇవే అసలైన వీడియోలు, ఫొటోలు. ఏఐ కాదు’ అంటూ క్యాప్షన్ పెట్టింది సాయిపల్లవి. దాంతో ఇన్నాళ్లు దర్శనమిచ్చిన బికినీ ఫొటోలన్నీ ఫేక్ అని తేలిపోయింది. అసలు వివరాల్లోకెళ్తే.. బీచ్‌లో అక్కతో దిగిన కొన్ని ఫొటోలను చెల్లి పూజా తన ట్విటర్లో పోస్టు చేసింది. వాటిని మార్ఫింగ్ చేసి బికినీ వేసుకున్నట్టు పోస్ట్ చేశారు. దీంతో అవి నిజమేనని నమ్మారు. ఈ విషయంలో సాయిపల్లవి క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.