Sai Pallavi | అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా జోనర్ ఏదైనా ఆ పాత్రలో జీవించేసే టాలెంటెడ్ భామల్లో టాప్‌లో ఉంటుంది సాయిపల్లవి (Sai Pallavi). సిల్వర్ స్క్రీన్‌పై అచ్చ తెలుగు అమ్మాయిలా మెరిసిపోతూ ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసింది. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన గతంలో చాలా వార్తలు తెరపైకి రాగా.. అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. తాజాగా మళ్లీ బీటౌన్ డెబ్యూ వార్త తెరపైకి వచ్చింది.
ఈ భామ బాలీవుడ్ తెరంగేట్రానికి అంతా సిద్దమైనట్టు ఫిలింనగర్ సర్కిల్లో న్యూస్ రౌండప్ చేస్తోంది. తాజా కథనాల ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఓ ప్రేమకథా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్లో సునీల్ పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్లో మెరవబోతుందని బీటౌన్ సర్కిల్ టాక్. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన సాయిపల్లవి.. డైరెక్ట్ బీటౌన్ ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలపై ఏదైనా స్పందిస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
సాయిపల్లవి ప్రస్తుతం శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ఎస్కే 21లో నటిస్తోంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. లాల్ సింగ్ చడ్డా సినిమా ఫెయిల్యూర్ తర్వాత అమీర్ ఖాన్ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.