Pranaya Godari | తన యాక్టింగ్‌తో కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మల్టీ టాలెంటెడ్ యాక్టర్ సాయికుమార్. ఈ సీనియర్ నటుడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ప్రణయ గోదారి’ (Pranaya Godari). గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సదన్, ప్రియాంక ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట చక్కర్లు రౌండప్ చేస్తోంది. తాజాగా విడుదల తేదీని ఫైనల్ చేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీని డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
సినిమాలోని పలు పాత్రలను పరిచయం చేస్తూ షేర్ చేసిన ఈ స్టిల్‌లో కోరమీసాలతో సీరియస్ లుక్‌లో కనిపిస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నాడు సాయికుమార్. ఈ చిత్రానికి మార్కండేయ సంగీతం అందిస్తున్నాడు. పీఎల్‌వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య తెరకెక్కిస్తున్నారు.
ప్రణయగోదారి రిలీజ్ అప్డేట్ లుక్..
Prepare for a wholesome entertainer that will tug at your heartstrings 💖#Pranayagodari is all set to hit the big screen on Dec 13th#Sadan #PriyankaPrasad@saikumaractor #30YearsPrithvi#JabardastRajamouli #SunilRavinuthala#PLVignesh#ParamallaLingaiah #PLVCreations… pic.twitter.com/YWjkiVTsW0
— SR Promotions (@SR_Promotions) December 1, 2024
Actress Sai Pallavi | నేను ఆ తప్పు చేయలేదు.. ఏడుస్తూ చెప్పిన నటి సాయిపల్లవి
Idly Kadai | ఇడ్లీకడైలో ధనుష్ లుక్ ఎలా ఉండబోతుందో తెలుసా..?