సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం సాయిదుర్గతేజ్ పుట్టిన రోజుని పురస్కరించుకొని ‘అసుర ఆగమన’ పేరుతో గ్లింప్స్‌ను విడుదల చేశారు. సాయిదుర్గతేజ్ను శక్తివంతమైన యోధుడిలా పరిచయం చేస్తూ మిథికల్ యాక్షన్ థీమ్‌తో గ్లింప్స్ మెప్పించింది. ఈ సందర్భంగా సాయిదుర్గతేజ్ మాట్లాడుతూ..ఈ సినిమా తన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని, దీనికోసం తన సర్వస్వం ధారపోశాననని అన్నారు.
అద్భుతమైన టీమ్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు రోహిత్ కేపీ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం సాయిదుర్గతేజ్ అద్భుతంగా మేకోవర్ అయ్యారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా అనిపిస్తుంది. అద్భుతమైన టీమ్‌తో ఈ సినిమా తీశాం’ అన్నారు. ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, రచన-దర్శకత్వం: రోహిత్ కేపీ.