Vishwambhara |చిరంజీవి హీరోగా టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చిరంజీవిపై ఇంట్రో సాంగ్ షూట్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
ఇదిలావుంటే ఈ మూవీలో మెగా వారసులు నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నటుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు నిహారికా కొణిదెలా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ షూటింగ్లో కూడా పాల్గోన్నాడని వార్తలు వస్తున్నాయి.