టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రస్తుతం విరూపాక్ష (Virupaksha)తో ఫుల్ బిజీగా ఉన్నాడు. SDT15 ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతోంది. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం మేకర్స్ తాజాగా తమిళ వెర్షన్ గ్లింప్స్ వీడియో (Virupaksha Tamil Title Glimpse) ను విడుదల చేశారు.
గంభీరమైన వాయిస్‌తో సాగుతున్న గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. కాంతారకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అంజనీశ్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనుందని తెలుస్తోంది.విరూపాక్ష చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలోసంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తెలుగు వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సాగుతూ.. గూస్ బంప్స్ తెప్పిస్తూ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
విరూపాక్ష తమిళ టైటిల్ గ్లింప్స్ వీడియో..
The Intriguing Glimpse of #Virupaksha is now yours in #Hindi #Tamil #Kannada & #Malyalam.
Hope you all will love it.Hindi
– https://t.co/uqiqsCOaKxTamil – https://t.co/UeJBxb9PxH
Kannada – https://t.co/uE6nUmNjIY
Malayalam – https://t.co/X6PNkQy2QS pic.twitter.com/eRMW8OBPM5
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 14, 2022
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
Read Also : Balakrishna | మోక్షజ్ఞ నామకరణం ఈ థియేటర్లోనే చేశారు : బాలకృష్ణ
Read Also : Waltair Veerayya | వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు టైం ఫిక్స్.. ప్రకటనే తరువాయి..!
Read Also : Aadhi Pinishetty | ఆది పినిశెట్టి బర్త్ డే స్పెషల్.. శబ్దం లుక్ రిలీజ్