Raja Saab | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి-గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ రాజాసాబ్ (Raja saab). పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. అయితే ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడా అని డైలామాలో ఉన్న అభిమానులు నిరాశ చెందుతున్నారు. వారి కోసం అదిరిపోయే అప్డేట్ అందించి జోష్ నింపాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్.
వారంలోపు ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన ప్రకటన ఉంటుందని చెప్పాడు. అంతేకాదు మూడు పాటలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కానున్నాయని చెప్పి అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు. అభిమానులు సినిమాకు వ్యతిరేకంగా చేసే నెగెటివ్ ట్రెండ్స్‌లో జాయిన్ కావొద్దని.. రాజాసాబ్ ఖచ్చితంగా వారికి వినోదాన్ని అందిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ఎస్ థమన్ కామెంట్స్‌తో రిలాక్స్ అయిపోతున్నారు మూవీ లవర్స్.
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నారు. గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడు.
Telusu Kada OTT | ఓటీటీలోకి సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Mirnalini Ravi | డబ్స్మాష్ నుంచి హీరోయిన్.. లగ్జరీ కారు కొనుగోలు చేసిన నటి మృణాళిని