They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓజీతో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు.
ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కాగా థమన్ అదిరిపోయే అప్డేట్ అందించి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. థమన్‌తోపాటు 117 మంది మ్యుజిషియన్స్ ఓజీ కోసం లండన్‌లోని అబ్బే రోడ్ స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్టూడియో ఫొటోను షేర్ చేస్తూ అందరితో పంచుకున్నాడు థమన్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్‌లో కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు విడుదల చేసిన రెండు పాటలను అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు థర్డ్ సింగిల్ గురించి ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది. కాగా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తుండటం.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.
#HungryCheetah 🐆 Was Sounding So Gigantic 🖤
From @AbbeyRoad With 117 Futuristic Musicians 🥹#OgBGM ❤️ pic.twitter.com/06ffXhNekY— thaman S (@MusicThaman) September 8, 2025
Janhvi Kapoor | జాన్వీ కపూర్ చాలా గ్రేట్.. అనీల్ కపూర్ కామెంట్స్ వైరల్
OTT | థియేటర్లో ఆదరణ లేదు.. ఓటీటీలో దుమ్ము లేపుతుందిగా..!
Bigg Boss9 | తొలి రోజే హౌజ్‌లో గందరగోళం..రీతూ చౌదరి, హరీష్, మనీష్ మధ్య మాటల యుద్ధం