బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం రన్ వే 34 (Runway 34). అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ కీ రోల్స్ లో నటించారు. కాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుని…ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే ఆసక్తికరంగా ఈ చిత్రానికి ఓటీటీ ప్లాట్ ఫాంలో ఎవరూ ఊహించని స్పందన వస్తోంది.
గత శుక్రవారం ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో విడుదలైన రన్ వే 34 టాప్-1 స్థానంలో నిలిచి..టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అమెజాన్ మూవీ సెక్షన్ జాబితాలో కేజీఎఫ్ చాఫ్టర్ 2, సర్కారు వారి పాట చిత్రాలను క్రాస్ చేసి మరీ టాప్ 1గా ట్రెండింగ్‌లో నిలువడం విశేషం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి డిజిటల్ ప్లాట్‌ఫాంలో మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
అజయ్‌దేవ్‌గన్ హోం బ్యానర్ అజయ్‌దేవ్‌గన్ ఎఫ్ఫిలిమ్స్, పనోరమ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బొమన్ ఇరానీ మరో కీలక పాత్రలో నటించారు. అమర్ మొహిలే, జస్లీమ్ రాయల్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లు.