ఎందుకు అరెస్ట్ చేయలేదు?
సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన పాత్రధారిగా సాగిన రెండొందల కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ప్రమేయం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించిన విషయం తెలిసిందే.
సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన పాత్రధారిగా సాగిన రెండొందల కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ప్రమేయం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆమెకు సెప్టెంబర్‌లో ఢిల్లీ పాటియాలా కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ దర్యాప్తు సంస్థలు కోర్టును ఆశ్రయించి వాదనలు వినిపించాయి. జాక్వెలిన్ దేశం వదిలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసిందని, విచారణకు కూడా ఏమాత్రం సహకరించడం లేదని ఈడీ వాదించింది. విదేశాలకు వెళ్లేందుకు కావాల్సినంత డబ్బు ఆమె వద్ద ఉందని అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు ఇప్పటివరకు జాక్వెలిన్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ‘ఆమెపై లుక్అవుట్ నోటీస్ జారీ చేసినప్పటికీ అరెస్ట్ మాత్రం చేయలేదు. ఇదే కేసులో మిగతా నిందితులు జైల్లో ఉన్నారు. కానీ జాక్వెలిన్ విషయంలో మీరు ఇతర మార్గాల్ని ఎంచుకున్నారు’ అని కోర్టు ఈడీ అధికారుల్ని ప్రశ్నించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

