RRR Vs KGF 2 | రెండు పాన్ ఇండియన్ సినిమాలే.. పైగా రెండూ సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి.. ఈ ఇద్దరు దర్శకులకు బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. వీళ్లు చేసిన సినిమాలు గతంలో నార్త్ ఆడియన్స్ ను బాగా మెప్పించాయి. ఒకరేమో అపజయమెరుగని దర్శకుడు.. మరొకరు కేవలం రెండు సినిమాలతోనే పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు. వాళ్లిద్దరు చేసిన సినిమాలు కూడా ఊహించని విధంగా కేవలం మూడు వారాల గ్యాప్‌లో బాక్సాఫీస్ దగ్గర పోటీకి సిద్ధమవుతున్నాయి. అవే రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న కేజీఎఫ్ 2. నిజానికి ఈ రెండు సినిమాలకు ఏడాదికి పైగా గ్యాప్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు.
ఎందుకంటే అప్పుడెప్పుడో 2018 డిసెంబర్లో కేజీఎఫ్ మొదటి భాగం విడుదలైంది. కన్నడలో తప్ప మిగిలిన భాషలలో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ హిందీ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో కూడా కేజీఎఫ్ సంచలన విజయం సాధించింది. దాదాపు 230 కోట్లకు పైగా వసూలు చేసి యశ్ ను పాన్ ఇండియా హీరోగా మార్చింది ఈ సినిమా. రెండోభాగం 2020లో విడుదలవుతుందని ముందు నుంచి చెబుతూ వచ్చారు దర్శక నిర్మాతలు. అయితే మధ్యలో కరోనా రావడంతో గ్యాప్ ఎక్కువైపోయింది. 2021 అక్టోబర్ 23న విడుదల చేస్తామంటూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ వైరస్ పోకపోవడంతో 2022 ఏప్రిల్ 14కు ఈ సినిమాను వాయిదా వేశారు.
మరోవైపు రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా కూడా 2020 జూలై 30న విడుదల అవుతుందని ముందు చెప్పారు. ఆ తర్వాత అది 2021 జనవరి 8కి మారింది. కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాకపోవడంతో 2021 అక్టోబర్ 13కి పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత జనవరి 7, 2022 అన్నారు. ఊహించని విధంగా కరోనా మూడో దశ రావడంతో మార్చి 25 కి ఈ సినిమాను వాయిదా వేశారు. అలా తిరిగి తిరిగి చివరికి కేవలం మూడు వారాల గ్యాప్‌లో ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాలపై అన్ని ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల బిజినెస్ 1000 కోట్లకు పైగానే జరిగింది. మరి బాక్సాఫీస్ దగ్గర వీటి పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.
దూసుకెళ్తున్న జీ5యాప్.. ఆ ఓటిటి సంస్థ చేతిలోనే RRR సహా 3 పాన్ ఇండియన్ సినిమాల రైట్స్
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. అయినా కేజీఎఫ్ 2 డేట్‌ను టచ్ చేయని టాలీవుడ్
kgf – kaikala satyanarayana | కేజీఎఫ్ సినిమాతో కైకాల కు సంబంధమేంటి?
Amitabh Bachchan: అమితాబ్ రోల్స్ రాయ్స్ కారుతో కేజీఎఫ్‌కు లింకేంటి ?