KGF Chapter 2 release date | తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాలు రిలీజ్ డేట్స్ కోలాహలం కనిపిస్తోంది. మార్చి లోపు కరోనా వైరస్ తగ్గిపోతుందని ఆరోగ్య శాఖ నమ్మకంగా చెబుతున్న నేపథ్యంలో.. తమ సినిమాల విడుదల తేదీలను వరుసగా ప్రకటిస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే మోస్ట్ అవైటెడ్ మూవీస్ ట్రిపుల్ ఆర్, ఆచార్య, ఎఫ్3, సర్కారు వారి పాట సినిమాల విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు. వీళ్లంతా కనీసం రెండు వారాల గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ని సినిమాలు ఒకేసారి రావాలంటే సీజన్ మొత్తం సరిపోదు. అయినా కూడా బయట పరిస్థితులను బేరీజు వేసుకుని.. ఒకరితో ఒకరు క్లాష్ కాకుండా తన సినిమాల విడుదల తేదీలు జాగ్రత్తగా ప్రకటిస్తున్నారు.
ఎంత జాగ్రత్త పడినా.. ఎఫ్3, ఆచార్య మధ్య బాక్సాఫీస్ పోరు తప్పడం లేదు. అయితే ఇన్ని సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా కూడా కేజీఎఫ్ 2 జోలికి మాత్రం ఎవరూ వెళ్లడం లేదు. దానికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నారు. బాహుబలి స్థాయిలో అది కూడా ఒక పాన్ ఇండియా సినిమా అని గుర్తు పెట్టుకున్నారు మన నిర్మాతలు. పైగా అందరి కంటే ముందు ఆరు నెలల కింద ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయనున్నట్లు కేజీఎఫ్ 2 నిర్మాతలు అనౌన్స్ చేశారు. అప్పటికి సంక్రాంతికి విడుదల చేసుకునే వీలున్నా.. పెద్ద సినిమాలన్నీ అయిపోయిన తర్వాత సోలోగా రావాలని ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు.
అయితే మధ్యలో మళ్లీ కరోనా థర్డ్ వేవ్ రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో విడుదల తేదీలు అన్నీ మళ్లీ కలగాపులగం అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ 14 డేట్‌ను ఎవరూ బ్లాక్ చేయలేదు. దాని తర్వాత వారం కూడా ఫ్రీగా వదిలిపెట్టారు. ఎందుకంటే కేజీఎఫ్ 2 సినిమాపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. ఇక్కడ కూడా సినిమా దాదాపు 60 కోట్ల బిజినెస్ చేస్తోంది. పైగా ఈ సినిమాను దిల్ రాజు కొన్నాడు. అందుకే రెండు వారాలు గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ 28న సినిమా విడుదల చేస్తున్నాడు ఈయన.
2018 డిసెంబర్లో కేజీఎఫ్ మొదటి భాగం విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో రెండో భాగంపై అంచనాలు పెరిగిపోయాయి. సెకండ్ పార్ట్ బిజినెస్ రూ.200 కోట్లు దాటిపోయింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యష్ హీరోగా నటిస్తున్నాడు. హోంబలే క్రియేషన్స్ ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్లతో నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
kgf – kaikala satyanarayana | కేజీఎఫ్ సినిమాతో కైకాల కు సంబంధమేంటి?
Amitabh Bachchan: అమితాబ్ రోల్స్ రాయ్స్ కారుతో కేజీఎఫ్‌కు లింకేంటి ?
KGF 2 రన్ టైమ్ అంత సేపా.. ప్రశాంత్ నీల్ కూర్చోబెడతాడా?
కేజీఎఫ్ 2లో ఎమోషన్ యాంగిల్ సంగతేంటి..?