KGF 2 రన్ టైమ్ అంత సేపా.. ప్రశాంత్ నీల్ కూర్చోబెడతాడా?
కేజీఎఫ్ ( KGF ) సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

కేజీఎఫ్ ( KGF ) సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రశాంత్ నీల్ రేంజ్ కూడా పెరిగిపోయింది. నేషనల్ వైడ్‌గా ఈయన పేరు మార్మోగుతోంది. వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ( KGF 2 ) ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిడివి గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా దాదాపు 3 గంటల నిడివి ఉండబోతుంది. పక్కాగా చెప్పాలంటే 2 గంటల 53 నిమిషాల నిడివితో ఈ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది. స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకొని ప్రేక్షకులను అంత సేపు కూర్చోబెడతానని నమ్మకంగా చెబుతున్నాడు ప్రశాంత్ నీల్. జూలై 16న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకే రోజు విడుదల కానున్న ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
తారక్ ప్రాజెక్టులన్నీ ఆలస్యం..!
క్వారంటైన్లో ఉన్న నాన్న కోసం స్పెషల్ దోశె వేసిన అర్హ
మహేష్ బాబు సినిమాతో జాన్వీ ఎంట్రీ పక్కానా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

