గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తెలుగు సినిమా సత్తా చాటిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ (RRR). సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఇప్పటికే ఈ క్రేజీ సినిమా ఖాతాలో పలు అంతర్జాతీయ అవార్డులు చేరిపోయాయి. తాజాగా ఆర్ఆర్ఆర్కు సంబంధించిన క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. లాస్ ఏంజెల్స్‌లోని ప్రపంచ అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ కలిగిన TLC Chinese Theaterలో స్పెషల్ స్క్రీనింగ్ కానుంది ఆర్ఆర్ఆర్.
తాజా అప్డేట్ ప్రకారం 2023 జనవరి 9న స్పెషల్ షో ఉండనుండగా.. డైరెక్టర్ రాజమౌళి, లీడ్ యాక్టర్లు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు ఎంఎం కీరవాణి కలిసి ఈ షోలో సందడి చేయనున్నారు. ఎపిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ (Ram Charan) నటించగా.. ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో నటించాడు. లియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
అవార్డులు, రికార్డులు..
ఆర్ఆర్ఆర్ ఇప్పటికే సటర్న్ అవార్డ్స్ (ప్రతిష్టాత్మక అమెరికన్ అవార్డు)లో భాగంగా ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు అందుకుంది. ఇదే కేటగిరీలో సన్‌సెట్ సర్కిల్ అవార్డు కూడా ఈ చిత్రాన్ని వరించింది. మరోవైపు జపాన్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన ఇండియన్ మూవీ ముత్తు సినిమాపై ఉన్న రికార్డును అధిగమించింది కూడా ఆర్ఆర్ఆర్.